భారతదేశం, అక్టోబర్ 7 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తాత శివ నారాయణ టిఫిన్ బండి దగ్గరగా కార్తీక్, దీప టిఫిన్ తింటారు. టేస్ట్ అదిరిపోయిందని అంటారు. చాలా రోజుల తర్వాత మంచి టిఫిన్ చేసిన అనుభూతి కలిగిందని కార్తీక్ అంటాడు.

రెండు ప్లేట్ లు కలిపి రూ.80 అని శివ నారాయణ చెప్తాడు. కానీ కార్తీక్ కావాలనే పర్స్ తెచ్చుకోలేదని అంటాడు. డబ్బులు ఎగ్గొడితే పనులు చేయించుకుంటారు కదా, మాతోని కూడా పని చేయించుకోండని కార్తీక్ అంటాడు. శివ నారాయణ వద్దు అన్నా కూడా కార్తీక్, దీప కలిసి అక్కడ పని చేస్తారు. వచ్చిన కస్టమర్లకు సర్వ్ చేస్తారు.

మరోవైపు జ్యోత్స్న పీఏగా చేరిందని ఇప్పుడు సుమిత్రకు చెప్పాల్సిన అవసరం ఏముందని మాలినిపై దక్షిణామూర్తి ఫైర్ అవుతాడు. నేను మీ మాటను గౌరవిస్తా. అందుకే జ్యోత్స్నకు పీఏ పోస్టు ఇస్తే ఎదురు చెప్...