భారతదేశం, జూలై 10 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 10 ఎపిసోడ్ లో శివ నారాయణ ఫ్యామిలీతో దక్షిణామూర్తి, మాలిని మాట్లాడతారు. సూరజ్, జ్యోత్స్నను భార్యాభర్తలని పూజారి అనుకుంటాడు. తన దగ్గర పని చేయమని దీపకు మాలిని ఆఫర్ ఇస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

గుడిలో శివ నారాయణ, మాలిని హోమం చేయిస్తారు. ఆ హోమం పూర్తి అయిన తర్వాత శివ నారాయణ ఫ్యామిలీ దగ్గరకు దక్షిణామూర్తి వెళ్తాడు. నా కూతురి కోసం ఈ శాంతి హోమం ఎందుకు చేయించానో నీకు తెలియాలని శివ నారాయణకు చెప్తాడు దక్షిణామూర్తి. కనీసం వచ్చే జన్మలోనైనా నేను బతికినంత కాలం నన్ను నాన్న అని పిలిచే అదృష్టం కోసమే హోమం అని వివరిస్తాడు.

నీదెంత రాతి గుండె నాన్న. అమ్మ అనే పిలుపునకు నన్ను దూరం చేసి, నువ్వు నాన్న అని పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నావా? గుండెల్లో లే...