భారతదేశం, అక్టోబర్ 6 -- Karthika Deepam 2 Today episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తాత దక్షిణామూర్తిని అడ్డుపెట్టుకొని సూరజ్ పీఏ పోస్టును జ్యోత్స్న పట్టేస్తుంది. మాలిని ఆ విషయాన్ని సహించలేకపోతుంది. జ్యోత్స్న వెళ్లి మాలినికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.

నాకు ఎక్కడా జాబ్ లేకుండా చేస్తానన్నావ్. ఇప్పుడు నీ కొడుకు దగ్గరే పీఏగా జాయిన్ అయ్యా. ఆఫీసులో అడుగుపెట్టనివ్వను అన్నావ్ కదా. ఇక ఆఫీస్ నిండా నా అడుగులే ఉంటాయి. నువ్వు జైల్లో పెట్టిన ఖైదీలా ఈ క్యాబిన్ లోనే ఉండిపోతావ్. నేను ఆఫీస్ మొత్తం గిరగిరా అంటూ తిరుగుతూనే ఉంటా. నీకు నచ్చినా నచ్చకపోయినా భరించాల్సిందేనని జ్యోత్స్న మాలినికి చెప్తుంది.

ఇది ఆఫ్టరాల్ పీఏ జాబ్. నువ్వు నా కొడుకు దగ్గర చేతులు కట్టుకొని ఉండాల్సిందేనని మాలిని కోపంతో అంటుంది. పీఏ అంటే ప్రేమించిన అమ్మాయి అత్త. సూరజ్ పీ...