భారతదేశం, నవంబర్ 11 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తూ ఆఫీసులో క్లయింట్ హెడ్ మహి అసభ్యంగా అన్న మాటలను తలుచుకుని జ్యోత్స్న బాధపడుతుంటుంది. మనసు, మనిషి ఒక్క చోట ఉంటేనే దాన్ని సాల్వ్ చేయగలవని సుమిత్ర వచ్చి అంటుంది.

ఆఫీసులో జరిగిన దాని గురించి ఇంట్లో పంచాయతీ పెడతారు. ఏం జరిగిందని జ్యోత్స్నను అందరూ అడుగుతారు. కానీ ఏం జరగలేదని చెప్పి జ్యో తప్పించుకోవాలనుకుంటుంది. అయితే కార్తీక్ జరిగింది చెప్తాడు. రేపటి లోపు సంజాయిషీ ఇచ్చుకోకపోతే రాజీనామా చేయాల్సిందేనని సూరజ్ అన్నాడని కార్తీక్ చెప్తాడు.

ఇంత గుడ్ న్యూస్ ఇంత లేటుగా చెప్తావేంట్రా? రేపటి నుంచి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని శివ నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఆఫీసుకు వెళ్తానని అంటుంది. సూరజ్ కే సమాధానం చెప...