భారతదేశం, ఆగస్టు 5 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 5 ఎపిసోడ్ లో సూరజ్ ను దత్తత తీసుకుంటానని జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఇస్తాడు శ్రీధర్. కానీ ఔట్ హౌజ్ లో సూరజ్ ఉండడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

సూరజ్ ఉత్తముడు, అందగాడు. అలాంటి వాడు కంపెనీలో ఉండాలని మీరు కోరుకున్నారు. మరి మీ మనవరాలికి భర్తగా ఉండే అర్హత లేదంటారా అని శివ నారాయణను దీప అడుగుతుంది. నీ చేతిలో దెబ్బలు తిని కూడా నిన్ను అర్థం చేసుకున్నాడు నాన్న అని సూరజ్ గురించి కాంచన గొప్పగా చెప్తుంది.

మిమ్మల్ని, మీ మనవరాలిని కాపాడటానికి సూరజ్ పుట్టుక అడ్డురాలేదు. కంపెనీలో అడ్వైజర్ గా పెట్టుకున్నప్పుడు పుట్టుక అడ్డురాలేదు. సూరజ్ నా మనిషి అని మాలినికి చెప్పినప్పుడు పుట్టుక అడ్డురాలేదు. నా మనవడు అని చెప్పినప్పుడు కూడా అడ్డు రాని పుట్టుక గురించి ఇప్పు...