భారతదేశం, నవంబర్ 10 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. టిఫిన్ బండి దగ్గర శివ నారాయణ టిఫిన్ వడ్డిస్తుంటాడు. ఇటు పారిజాతం ఏమో సైలెంట్ గా గల్లా పెట్టెలో నుంచి డబ్బు కొట్టేస్తుంది. కార్తీక్ వచ్చి తన చేతిని పట్టుకోవడంతో పారిజాతం షాక్ అవుతుంది.

శివ నారాయణ వచ్చి ఏం జరిగిందని అడిగితే.. పారు దొంగతనం చేస్తుంటే లైవ్ లో పట్టుకున్నానని కార్తీక్ చెప్తాడు. సాయంగా ఉంటావనుకుంటే చేతి వాటం చూపిస్తావా అని శివ నారాయణ ఫైర్ అవుతాడు. అందరూ నన్ను మోసం చేశారు. చివరకు నువ్వు కూడా మోసం చేస్తావా అని సీరియస్ అవుతాడు.

నమ్మిన వాళ్ల చేతిలో మోసపోవడం అలవాటు అయిందని కార్తీక్ ను ఉద్దేశించి శివ నారాయణ కౌంటర్ వేస్తాడు. బాగైందా అని పారు అంటుంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుందని కార్తీక్ చెప్పి వెళ్లిపోతాడు.

ఇటు ఆఫీసులో క్లయింట్ తో సూరజ...