భారతదేశం, ఆగస్టు 18 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 18 ఎపిసోడ్ లో.. దీప ఇచ్చిన సలహా మేరకు సూరజ్ ను పెంచిన పెద్దయ్య దగ్గరకు జ్యోత్స్న వెళ్తుంది. సూరజ్ గురించి పూర్తిగా చెప్పమని అడుగుతుంది. సూరజ్ నాలుగేళ్ల వయసు నుంచి నా దగ్గరే పెరిగాడు. వాడొక అనాథ. వాడికంటూ ప్రత్యేకంగా ఇష్టాలు ఏం లేవు. కానీ చాలా మొండివాడు అని పెద్దయ్య చెప్తాడు.

పెద్దయ్యకు జ్యోత్స్న డబ్బులు ఇస్తుంది. నేను ఇస్తే సూరజ్ ఇచ్చినట్లేనని చెప్తుంది. నిన్ను చూస్తుంటే కేవలం ఫ్రెండ్ అని అనిపించడం లేదు. ఏవైనా దేవుడు వేసిన బంధాలే అని పెద్దయ్య అంటాడు. అక్కడి నుంచి జ్యోత్స్న వెళ్లిపోయిన తర్వాత సూరజ్ కు పెద్దయ్య కాల్ చేస్తాడు.

నీ ఫ్రెండ్ వచ్చింది. డబ్బులు కూడా ఇచ్చిందని జ్యోత్స్న వచ్చిన విషయాన్ని సూరజ్ కు పెద్దయ్య చెప్తాడు. నీ గురించి మంచీచెడులు అడిగింది. ఆ ...