భారతదేశం, ఆగస్టు 21 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన ప్రేమ గురించి సూరజ్ కు అర్థమయ్యేలా చెప్తుంది జ్యోత్స్న. ఇది మన ప్రేమ కథ. మర్చిపోలేని అందమైన ప్రేమ కథ అని జ్యోత్స్న అంటుంది. నీకు పెళ్లి అనగానే దాసు ఎందుకు ఆనందపడుతున్నాడని సూరజ్ అడుగుతాడు.

సూరజ్ ప్రశ్నతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దశరథ కంటే దాసు కళ్లలోనే ఆనందం చూశానని సూరజ్ అంటాడు. ఆయన నాకు చిన్నాన్న అవుతాడు కాబట్టి, అన్నయ్య కూతురు పెళ్లి అంటే సంతోషం ఉంటుంది. ఇంకా ఏమైనా కావాలంటే ఆయన్నే అడగమని చెప్పి జ్యోత్స్న వెళ్లిపోతుంది.

ఇటు ఉదయం కొత్త చీర, ఒంటి నిండా నగలతో పారిజాతం మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తుంది. ఇదంతా ఏంటీ అని కార్తీక్ అడుగుతాడు. పారు నియమాలు ఉల్లంఘించిందని తాతకు చెప్తాడు కార్తీక్. మీ తాతే పర్మిషన్ ఇచ్చారు. మీ తాత వరం ఇచ్చారని పారు చెప్తు...