భారతదేశం, జూలై 14 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 14 ఎపిసోడ్ లో పోటీకిి ఒప్పుకొంటాడు శివ నారాయణ. ఆ బాధ్యత మొత్తం దీప మీదే వేస్తాడు. ఈ పోటీలో దీపను ఓడించాలని జ్యోత్స్న కుట్ర పన్నుతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ ను చూసేయండి.

దక్షిణామూర్తితో పోటీకి వెళ్లాలని సుమిత్ర గట్టిగా అరుస్తుంది. నా మెట్టినింటి పౌరుషం ఏంటో వాళ్లకు తెలియాలి. మామయ్య ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. ఇది నా కోసం అని అని సుమిత్ర సమరానికి సై అంటుంది. పోటీ బాధ్యత మొత్తం కంపెనీ సీఈఓ దీప మీద పెడతాడు శివ నారాయణ.

ఇది పోటీ కాదు. ఈ ఇంటి కోడలిగా నా ఆత్మ గౌరవం. దాన్ని నువ్వు గెలిపించాలని దీపతో సుమిత్ర చెప్తుంది. దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్లే అని షాకింగ్ కామెంట్లు చేస్తాడు శివ నారాయణ. మనం గెలుస్తామని దీప, కార్తీక్, సూరజ్ నమ్మకంగా చెప్త...