భారతదేశం, జూలై 8 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 8 ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మాలిని ఎవరో కాదు.. దక్షిణామూర్తి కోడలే అని తెలిసిపోతుంది. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

సూరజ్ రెండు గంటలు లేటుగా ఆఫీస్ కు వస్తానని పర్మిషన్ అడుగుతాడు. ఎక్కడికి వెళ్తావని కార్తీక్, జ్యోత్స్న గుచ్చిగుచ్చి అడుగుతారు. శనీశ్వరుణ్ని కలిసేందుకు వెళ్తున్నా. నాకే దోష నివారణ కోసం వెళ్తున్నా. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని జ్యోత్స్న వైపు చూస్తూ సూరజ్ చెప్తాడు.

ఛైర్మన్ నా పెళ్లి గురించి అడిగారు. మిమ్మల్ని, వదినను చూసి నేను పెళ్లి చేసుకుని మీలాంటి ఆదర్శ దాంపత్యాన్ని కొనసాగించాలని అనుకుంటున్నా. ఆన్ లైన్ లో రెండు మూడు సంబంధాలు చూశా కానీ రిజెక్ట్ అ...