భారతదేశం, ఆగస్టు 11 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 11 ఎపిసోడ్ లో.. అసలు జీవితంలో పెళ్లే చేసుకోనని జ్యోత్స్న చెప్పిన విషయంపై ఆఫీస్ లో దీప ఆలోచిస్తుంది. మాట్లాడేందుకు జ్యోత్స్నను పిలుస్తుంది. జ్యోను కుర్చీలో కూర్చోబెట్టి మనం కాసేపు ఇద్దరం తోడబుట్టువులాగా మాట్లాడుకుందామా? ఏ అమ్మాయి అని పెళ్లి చేసుకొని పిల్లలను కనాల్సిందేనని దీప చెప్పడం స్టార్ట్ చేస్తుంది.

పెళ్లి మీద విరక్తి కలిగిందని జ్యోత్స్న అంటుంది. అది అబద్ధం. నీది కోపం, బాధ. దానికి కారణం సూరజ్ తిరస్కరించడమే. అది నిన్ను తట్టుకోలేనంతగా బాధపెడుతోంది. ఆ బాధతోనే పెళ్లి చేసుకోను అనే నిర్ణయం తీసుకున్నావ్. నిజం ఏంటో తెలుసా? సూరజ్ కు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ప్రేమిస్తున్నాడు. పంతానికి పోయి సూరజ్ ను దూరం చేసుకోకు అని దీప చెప్తుంది.

ఒంటరి జీవితం వసంత కాలంలో ఎండ...