భారతదేశం, సెప్టెంబర్ 18 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కార్తీక్, దీపలపై శివ నారాయణ నిందలు వేస్తూనే ఉంటాడు. కార్తీక్, దీప చాలా మంచివాళ్లు. వాళ్లు తీసుకొచ్చిన సూరజ్ ఇంకా మంచోడు. సంతకాలు పెట్టించుకున్నారు. చావుదెబ్బ తీశారని శివ నారాయణ ఫైర్ అవుతాడు.

మమ్మల్ని ప్రమాదంలో పడేశాడని నిండా మునిగాక కానీ తెలియలేదు. మీ వల్లే రోడ్డు మీద పడ్డాం. మళ్లీ మీ పంచన ఎలా చేరతామని శివ నారాయణ మండిపడతాడు. ముందు మన ఇంటికి వెళ్దాం పదా తాత. మీరు రోడ్డున పడ్డారు అని కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ శివ నారాయణ మాత్రం వినడు. ఇక దొరికిందే ఛాన్స్ అని దీపను నోటికి వచ్చినట్లు తిడుతుంది పారిజాతం.

కార్తీక్ సాయం అవసరం లేదని జ్యోత్స్న కూడా తెగేసి చెప్తుంది. అయినా కూడా కార్తీక్ రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడు. మీ అమ్మకు నేను చచ్చిపోయ...