భారతదేశం, ఆగస్టు 31 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన భర్త కృష్ణ‌మూర్తి ఫొటోను చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది మాలిని. దశరథ అన్నయ్యను చంపడానికి యాక్సిడెంట్ చేయించా. ఈ పని చేయాల్సింది నువ్వు. కానీ నువ్వు చెల్లి మీద ఉన్న ప్రేమకు కరిగిపోయి క్షమించి వదిలేశావ్. కానీ నేను నీలా చేతకానిదాన్ని కాదని భర్తతో గతంలో మాలిని అంటుంది.

నా చెల్లి దశరథను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. నాకు కోపం వచ్చి అరిచాను. కానీ తర్వాత ఆలోచించా. దాని బతుకు అది బతుకుందని వదిలేశానని కృష్ణ‌మూర్తి అంటాడు. కానీ నేను అలా వదల్లేను. సుమిత్రను మా అన్నయ్యకు ఇచ్చి చేస్తే మన జీవితాలు ఎంతో గొప్పగా ఉండేవి. కానీ సుమిత్ర ఆ దశరథను పెళ్లి చేసుకుంది. మా అన్నయ్యను ఛీ కొట్టినట్లే కదా అని మాలిని చెప్తుంది.

దశరథ అన్నయ్యను చంపి సుమిత్రను తీసుకొస...