భారతదేశం, సెప్టెంబర్ 9 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. అనుకోకుండా శివ నారాయణ ఇంటికి కార్లో వస్తాడు సూరజ్. ఎందుకు వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. కొన్ని రోజులు ఇక్కడే ఉన్నాను కదా, మా ఇల్లు అనుకొని వచ్చానని సూరజ్ నిజాన్ని చెప్తాడు.

నువ్వు మారిపోయావ్ జీనియస్. నీలో రియలైజేషన్ మొదలైంది. అందుకే నీ ఆలోచనలు అదుపు లేకుండా పోయాయని జ్యోత్స్న లాజిక్ మాట్లాడుతుంది. నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు రియలైజ్ అవుతా. మనసులోకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోను అంటూ సూరజ్ తిక్కగానే మాట్లాడతాడు.

కొందరికి ఊపిరి ప్రాణమైతే, కొందరికి మనసే ప్రాణం. ఒకరి ఊపిరి తీసే హక్కు లేనట్లే, ఒకరి మనసుకు గాయం చేసే హక్కు ఎవరికీ లేదని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది. జరిగింది గతం, జరుగుతుంది వాస్తవం. నేను వాస్తవంలోనే బత...