భారతదేశం, నవంబర్ 26 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. సూరజ్ ది తాను కాపాడిన ప్రాణమని, అది తనకే సొంతమని మాలినికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి సూరజ్ ను చూసేందుకు జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. ఇటు బయట ఏమో జ్యోత్స్నను చంపేందుకు ప్లాన్ చేసింది నువ్వే పిన్ని అని మాలినికి కార్తీక్ షాకిస్తాడు.

మాలినినే జ్యోత్స్నను చంపడానికి ప్లాన్ చేశావని పోలీస్ ఆఫీసర్ ఆదిత్య జ్యోత్స్నను వివరాలు అడిగేటప్పుడు అన్నారని కార్తీక్ మాట మారుస్తాడు. జ్యోత్స్న ఎందుకు మాయమైందో తెలీదు. ఆ విషయంలో మాలినిపైనే అనుమానం ఉందని జ్యో అన్నది కదా.. అదే పగతో నువ్వు ఈ పని చేయించే అవకాశం ఉందని పోలీసు వాళ్లు అనుమానంతో అడిగారని కార్తీక్ చెప్తాడు.

మాలినినే షూట్ చేయించిందని దీప కూడా అంటుంది. బుల్లెట్ తగిలింది తన కొడుక్కని మాలిని తప్పించుకునే ప్రయత్నం చేస...