భారతదేశం, అక్టోబర్ 30 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. శివ నారాయణ టిఫిన్ బండి దగ్గర దీప గిన్నెలు కడుగుతుంటుంది. అది చూసిన జ్యోత్స్న తానే ఆ పని చేస్తానంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ వి, కింద కూర్చుని గిన్నెలు కడగాలంటే ఇబ్బంది అవుతుంది. నేను కడుగుతానని జ్యోత్స్న పని చేస్తుంది.

నీకు చేతకాదు జ్యోత్స్న అని దీప అంటుంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తాయి దీప. నేను చేయగలనని జ్యోత్స్న గిన్నెలు తోముతుంది. అది చూసిన కార్తీక్.. జ్యోత్స్న మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో పాల్గొన్న రోజులను గుర్తు చేసుకుంటాడు. అప్పుడే వచ్చిన సుమిత్ర.. జ్యోత్స్నను చూసి షాక్ అవుతుంది. కానీ దశరథ ఏమో పని చేయమంటాడు.

మోసం చేసిన సూరజ్ ను నేనేమైనా చేయగలిగానా? అని శివ నారాయణ అంటాడు. అప్పుడే సూరజ్ కార్లో వస్తాడు. అదే కార్లో పారిజాతం ఉంటుంది. హే...