భారతదేశం, నవంబర్ 18 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. రూ.2 కోట్లకు జ్యోత్స్న ప్రేమ అమ్ముకుందని సూరజ్ మనసులో మాలిని విషం నాటుతుంది. దీంతో జ్యోకు సూరజ్ గుడ్ బై చెప్తాడు. ఈ విషయాన్ని మాలిని ఇంట్లోనే తేల్చుకుందామని కార్తీక్, దీప, జ్యోత్స్న అనుకుంటారు.

మరోవైపు తల్లి మాటలను గుడ్డిగా నమ్మిన సూరజ్ ఇంట్లో కూర్చుని బాధపడుతుంటాడు. సూరజ్ ను ఏమైందని దక్షిణామూర్తి అడుగుతాడు. కానీ సూరజ్ ను మాట్లాడనివ్వకుండా మాలిని అడ్డుకుంటుంది. వాడు నిజాలు తెలుసుకున్నాడు. కాసేపు ఒంటరిగా వదిలేయండి మామయ్య అని మాలిని అంటుంది. ఏంటా నిజాలు అని దక్షిణామూర్తి అడుగుతాడు.

అది నేను చెప్తాను తాత అని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. వెనుకాలే దీప, జ్యోత్స్నతో పాటు పారిజాతం కూడా వస్తారు. ఒక అబద్ధాన్ని అందమైన నిజంలా మార్చగలా పిన్ని వల్ల మేం రావాల్...