భారతదేశం, అక్టోబర్ 13 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. జ్యోత్స్నను ఆఫీసుకు రానివ్వనని సూరజ్ చెప్పాడు. ఎక్కడికి వెళ్లాడో, ఎవరిని కలిశాడో మాత్రం ఇంతవరకూ చెప్పలేదని మాలిని తనలో తాను అనుకుంటుంది. అప్పుడే వచ్చిన దక్షిణామూర్తి.. మాలినితో ఆఫీసుకు వస్తానంటాడు.

నా మనవరాలు జ్యోత్స్న ఫస్ట్ డే ఆఫీసుకు రాబోతుంది. తనను విష్ చేస్తా. స్వీట్స్ కూడా పంచుతానని దక్షిణామూర్తి చెప్తాడు. సూరజ్ తాతయ్య చెప్పింది విన్నావా? అని మాలిని వెటకారంగా అంటుంది. తనకు తలనొప్పిగా ఉంది, ఆఫీసుకు రానని చెప్పి మాలిని ఇంట్లోనే ఉండిపోతుంది. సూరజ్ వెళ్తూ వెళ్తూ మాలినిని అనుమానంగా చూస్తాడు.

మరోవైపు కార్తీక్, దీప ఆఫీసుకు రెడీ అవుతారు. జ్యోత్స్న కోసం అమ్మ ఏడుస్తుందని దీప చెప్తుంది. మనకు సూరజ్, మాలిని మీద అనుమానం ఉంది. ఈ రోజు క్లారిటీ వస్త...