భారతదేశం, అక్టోబర్ 18 -- Karthika Deepam 2 Serial: బుల్లితెరపై తిరుగులేని రేటింగ్ తో దూసుకుపోతోంది కార్తీక దీపం 2 సీరియల్. ఈ సీరియల్ లోని ఎమోషన్స్, ట్విస్ట్, రివేంజ్ డ్రామాకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీరియల్ రీచ్ ను మరింత పెంచడం కోసం మేకర్స్ జ్యోత్స్నతో బాగానే మైండ్ గేమ్స్ ఆడిస్తున్నారని చెప్పొచ్చు.

కార్తీక దీపం 2 సీరియల్ ఫస్ట్ నుంచి రివేంజ్ డ్రామాగానే సాగుతుంది. కార్తీక్ ను పెళ్లి చేసుకుందని దీపపై రివేంజ్ తీర్చుకోవాలని జ్యోత్స్న నానా కుట్రలు చేసింది. తన సొంత అమ్మానాన్నలకు దూరం చేసి, వారసురాలిగా ఉంటున్న జ్యోత్స్న మోసాన్ని బయటపెట్టాలని కార్తీక్, దీప ట్రై చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు స్టోరీ ఏమో మాలిని, సూరజ్ పై రివేంజ్ డ్రామాగా మారిపోయింది.

కార్తీక దీపం 2 సీరియల్ లోకి సూరజ్, మాలిని అడుగుపెట్టినప్పటి నుంచి ట్విస్టుల...