భారతదేశం, నవంబర్ 22 -- Karthika Deepam 2 Serial: స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ కు తెలుగు జనాలు జై కొడుతున్నారు. రివేంజ్ డ్రామాగా కొనసాగుతున్న ఈ సీరియల్ స్టోరీ ఇప్పుడు ఆడియన్స్ ను బాగా అలరిస్తోంది. తాజాగా ఈ సీరియల్ లో జ్యోత్స్న విలనిజం మరోసారి బయటకు వచ్చేలా కనిపిస్తోంది.

కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు రివేంజ్ డ్రామాగా మారింది. శివ నారాయణ కుటుంబం పతనం కోసం మాలిని కుట్రల మీద కుట్రలు పన్నుతోంది. జ్యోత్స్నను ప్రేమ పేరుతో మోసం చేసేలా తన కొడుకును ఉసిగొల్పింది. ఇప్పుడేమో జ్యోత్స్న క్యారెక్టర్ పై పెద్ద నింద వేసి సూరజ్ మనసులో నుంచి తనను తీసేసేలా ప్లాన్ వేసింది.

ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేసిన, తన ప్రేమను దూరం చేసిన, తమను రోడ్డుకు ఈడ్చిన మాలినిపై రివేంజ్ తీర్చుకోవడానికి జ్యోత్స్న రెడీ అయింది. సూరజ్ ను పెళ్లి చేసుకుని తీరుతానన...