భారతదేశం, జూలై 24 -- Karthika Deepam 2 Jyotsna: తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరిస్తూ, టాప్ రేటింగ్స్ లో దూసుకుపోతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఇందులో పవర్ ఫుల్ విలన్ గా, సైకోయిజం చూపించే మరదలు జ్యోత్స్న గెటప్ లో గాయత్రి సింహాద్రి అదరగొడుతోంది. తన యాక్టింగ్ తో సీరియల్ ను ఇంట్రెస్టింగ్ గా మారుస్తుంది. మరి ఈ భామ కెరీర్ చూస్తే షాక్ కలుగుతుంది.

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న గా విలనిజం పండిస్తున్న గాయత్రి సింహాద్రి ప్రయాణం కేవలం నటనకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ లో పెరిగిన గాయత్రి చిన్నతనం నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, స్టేజ్ పర్ఫార్మన్సులపై ఇంట్రెస్ట్ చూపించేది.

మొదట వైజాగ్‌లోని స్థానిక టీవీ ఛానెళ్లలో, రీజనల్ ఈవెంట్లలో యాంకర్ గా గాయత్రి తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, ఎనర్జీతో గుర్తిం...