భారతదేశం, సెప్టెంబర్ 12 -- Karthika Deepam 2: స్టార్ మాలో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2' రోజుకో ఊహించని మలుపుతో ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. కథలో ప్రధాన విలన్‌గా మారిన మాలిని.. తన కొడుకు సూరజ్ కన్నుగప్పి వరుస దారుణాలకు ఒడిగడుతోంది. శివ నారాయణకు చెందిన వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన రెస్టారెంట్లపై భౌతిక దాడులు చేయిస్తోంది.

కార్తీక దీపం 2 సీరియల్ లో మాలిని విలనిజం ఎక్స్ ట్రీమ్ కు చేరుకుంది. ఆమె క్రూరత్వంతో వ్యవహరిస్తోంది. శివ నారాయణ రెస్టారెంట్లపై దాడులు చేయిస్తోంది. అంతే కాకుండా తనకు అడ్డుగా నిలుస్తోందని భావించిన దీపను శాశ్వతంగా అంతమొందించేందుకు యాక్సిడెంట్ చేయించింది.

కార్తీక దీపం 2 సీరియల్ లో మాలిని డబుల్ ఫేస్ చూపిస్తోంది. సూరజ్ ముందు మాత్రం ఏం తెలియని అమాయకురాలిలా కొడుకును రెచ్చగొడుతోంది. కానీ వెనుకాల ...