భారతదేశం, ఏప్రిల్ 23 -- Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ లో సుమిత్ర క్యారెక్టర్ తో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న నటి సీత. సీరియల్ లో తన పాత్రలో ఆమె జీవిస్తూ, ప్రతి ఎపిసోడ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తోంది. సీరియల్ లో తల్లి పాత్ర పోషిస్తున్న సీత.. బయట మాత్రం డ్యాన్స్ లు, రీల్స్ తో హుషారుగా ఉంటోంది.

కార్తీక దీపం 2 సీరియల్ ను చూసేవాళ్లకు, అందులోని సుమిత్ర క్యారెక్టర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు కన్న కూతురు దీప, మరోవైపు పెంచిన కూతురు జ్యోత్స్న తల్లిగా సుమిత్ర క్యారెక్టర్ కొనసాగుతోంది. కానీ దీప కన్న కూతురని, జ్యోత్స్న తన సొంత కుమార్తె కాదని సుమిత్రకు ఇంకా నిజం తెలియదు.

కార్తీక దీపం 2 సీరియల్ లో బరువైన, ప్రధాన పాత్ర పోషిస్తున్న సుమిత్ర అలియాస్ సీత తాజాగా డ్యాన్స్ తో అదరగొట్టింది. డాడీ సినిమాలోని చి...