భారతదేశం, ఆగస్టు 2 -- Karthika Deepam 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం 2 సీరియల్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో ఎప్పుడూ టాప్ లోనే దూసుకెళ్తోంది. ఇప్పుడీ సీరియల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. అసలు ఆట ఆడిస్తున్న గేమ్ మాస్టర్ ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న, సూరజ్ పెళ్లికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఇదే ఖాయమనిపిస్తోంది. జ్యోత్స్నకు పెళ్లి చేయరా? అంటూ శివ నారాయణ ఫ్యామిలీని మాలిని రెచ్చగొట్టింది. వెంటనే రంగంలోకి దిగిన శివ నారాయణ అండ్ కో జ్యోత్స్నకు సూరజ్ అయితే కరెక్ట్ అని తేల్చేసింది. దీంతో సూరజ్ వెనుకాల ఉన్న గతాన్ని, మిస్టరీని కనుక్కునేందుకు కార్తీక్ రంగంలోకి దిగాడు.

సూరజ్ గతం గురించి ఇప్పటివర...