భారతదేశం, ఏప్రిల్ 14 -- Karthika Deepam: 'మసూద' ఫేమ్ తిరువీర్ నటించిన 'పాపం ప్రతాప్' సినిమా ప్రమోషన్లలో భాగంగా 'కార్తీక దీపం' ఫేమ్ డాక్టర్ బాబు (నిరుపమ్ పరిటాల) ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లయిన నాలుగు రోజులకే భార్య విడిచి పెట్టి వెళ్లడంతో ఆ ప్రతాప్ కు ఈ డాక్టర్ బాబు ఏం సలహా ఇచ్చాడో చూడండి.

మల్టీ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్' (Papam Prathap). ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుల్లితెర మెగాస్టార్, 'కార్తీక దీపం' సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 'డాక్టర్ బాబు'గా సుపరిచితుడైన నిరుపమ్ పరిటాలతో తిరువీర్ జరిపిన చిట్ చాట్ నెట్టింట సెన్సేష...