భారతదేశం, ఏప్రిల్ 6 -- ప్రముఖ టీవీ, సినీ నటి కరిష్మా తన్నా తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఆమె 42 ఏళ్ల వయసులో తల్లి కానుంది. భర్త వరుణ్ బంగేరాతో కలిసి తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు కరిష్మా సోమవారం (ఏప్రిల్ 6) నాడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ వార్త విన్న అభిమానులు, తోటి నటీనటులు ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కరిష్మా తన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అందమైన ఫొటోలను పంచుకుంటూ ఈ విషయాన్ని ధృవీకరించింది. "ఒక చిన్న అద్భుతం.. మాకు దక్కిన గొప్ప బహుమతి - ఆగస్టు 2026" అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది.

2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత తమ కుటుంబాన్ని విస్తరించుకుంటుండటం విశేషం. డెలివరీ తేదీని కూడా ఆమె ముందే వెల్లడించడంతో అభిమానులు ఆ క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కరిష్మా...