భారతదేశం, మే 25 -- Kara OTT Release Date: ధనుష్ హీరోగా నటించిన తాజా హీస్ట్ థ్రిల్లర్ 'కర' (Kara) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో మే 28 నుండి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓటీటీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే మరో క్రేజీ అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది.

'కర' మూవీ మే 28 నుంచి కేవలం తమిళంలోనే కాకుండా ఒకేసారి తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మాత్రం మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. థియేట్రికల్ విడుదలైన నాలుగు వారాల విండో కాలపరిమితి తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

'పోర్ తోళిల్' (Por Thozhil) సినిమాతో సూపర్ హిట్ ...