భారతదేశం, జూలై 29 -- Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్, మండి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ కంగాన రనౌత్ (Kangana Ranaut) ఎప్పుడూ తన బోల్డ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జెన్ జెడ్ (Gen Z) నిరసనలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెను విమర్శించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్‌పై కంగనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో సౌరవ్ దాస్ వీడియోను రీపోస్ట్ చేస్తూ కంగనా రనౌత్ సంచలన కామెంట్లు చేశారు. "నేను ఈ వ్యక్తి గురించి గూగుల్ చేసి చూశా. అతనికి 28 ఏళ్లు. ఇప్పటికీ స్టూడెంట్ ను అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు!

నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు, కానీ గత 20 ఏళ్లుగా ప్రజల మధ్యే జీవిస్తున్నాను. అతడి వయస్సు (28 ఏళ్లు) నాకున్నప్పుడు, నా చేతిలో అప్పటికే 2 నేషనల్ అవార్డులున్...