భారతదేశం, సెప్టెంబర్ 14 -- Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల తనపై, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డ్రామా క్వీన్ రాఖీ సావంత్‌కు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీవితంలో ఏమీ సాధించలేని వైఫల్యంతో ఉన్నవాళ్లే సక్సెస్‌ఫుల్ మహిళలను టార్గెట్ చేస్తారని కంగనా ఘాటుగా స్పందించారు.

రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించారు. "జీవితంలో ఏమీ సాధించలేకపోయిన అసూయాపరులు, వైఫల్యంతో ఉన్న వ్యక్తులు సక్సెస్‌లో ఉన్న మహిళల క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ల ఈగోని, ఈర్శ్యను సంతృప్తి పరచుకోవడానికే ఇలాంటి పనులు చేస్తారు" అని రాసుకొచ్చారు.

"విజయం సాధించడాని...