భారతదేశం, మే 22 -- Kangana Ranaut: నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ఏం చేసినా అది క్షణాల్లో సంచలనంగా మారుతుంది. తాజాగా ఆమె పబ్లిక్‌గా మెడలో మంగళసూత్రంతో కనిపించడంతో నెట్టింట పెళ్లి పుకార్లు శరవేగంగా వ్యాపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కంగనా ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకుందా అనే చర్చ నడుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలలో కంగనా రనౌత్ చాలా సింపుల్ సల్వార్ సూట్‌లో కనిపించింది. కానీ అందరి కళ్లూ ఆమె మెడలోని మంగళసూత్రం పైనే పడ్డాయి. దీనితో పాటు ఆమె నుదుటన బొట్టు, చేతులకు పచ్చటి గాజులు, కళ్లద్దాలు ధరించి సెక్యూరిటీ సిబ్బందితో కలిసి తన కారు వైపు వెళ్తూ కనిపించింది. అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఎలాంటి పోజులు ఇవ్వకుండా, సీరియస్ ముఖంతో ఆమె కారు ఎక్కి వెళ్లిపోయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట...