భారతదేశం, జూన్ 12 -- Kane Williamson: క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఒక ఊహించని వార్త వెలువడింది. న్యూజిలాండ్ క్రికెట్ హిస్టరీలోనే అత్యంత గొప్ప బ్యాటర్‌గా, క్లాస్ కెప్టెన్‌గా పేరొందిన కేన్ విలియమ్సన్ అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కు తక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

దీనితో అతని 16 ఏళ్ల అద్భుతమైన క్రికెట్ కెరీర్ కు తెరపడింది. గ్రౌండ్ లో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటూ, జట్టును ముందుండి నడిపిన ఈ 'కూల్ కెప్టెన్' ఇకపై ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో కనిపించరనే వార్త అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

గత దశాబ్ద కాలంగా వరల్డ్ క్రికెట్‌ను శాసించిన జో రూట్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల సరసన 'ఫ్యాబ్ ఫోర్' (Fab Four) గ్రూప్‌లో విలియమ్సన్ ఒకరిగా గుర్తింపు పొందాడు. మోడ్రన్ క్రికెట్‌లో అద్భుతమైన టెక్నిక్, క్లా...