భారతదేశం, అక్టోబర్ 9 -- Kamal Haasan: భారతీయ శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్, గ్లోబల్ టెక్ దిగ్గజాల ఒత్తిళ్లపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ అత్యంత తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను నేరుగా ఉద్దేశిస్తూ.. "మిస్టర్ మస్క్.. భారతీయుడైనా లేదా అమెరికన్ అయినా సరే ఏ బిలియనీర్ కూడా ఒక దేశం విధానాలను శాసించలేడు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా టెలికాం వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, జాతీయ భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టదని కమల్ హాసన్ స్పష్టం చేశారు.

మన దేశంలో సుదూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కనెక్టివిటీ అందించడానికి శాటిలైట్ ఇంటర్...