భారతదేశం, ఆగస్టు 11 -- Kamakshi Bhaskarla: సీనియర్ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'అగధ' (Agadha) ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది.

హారర్ థ్రిల్లర్ అగధ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామాక్షి భాస్కర్ల కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"నేను 2017 ఆగస్టులో ఇండియాకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లయినా, ఒక సినిమాలో మెయిన్ లీడ్ రోల్ సాధించడానికి నాకు 9 ఏళ్లు పట్టింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా తక్కువ అనేది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఇప్పుడిప్పుడే పరిశ్రమలో మార్పు వ...