భారతదేశం, జూన్ 16 -- Kalki 2898 AD Sequel: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌కు ముడిపెడుతూ వైజయంతీ మూవీస్ సృష్టించిన ఈ సినిమాటిక్ యూనివర్స్ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ 'కల్కి 2' కాస్టింగ్‌కు సంబంధించి కొన్ని షాకింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఏడీ ఎపిక్ సీక్వెల్‌లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఒక పవర్‌ఫుల్ కామియో రోల్‌లో కనిపించబోతుందనే టాక్ తెగ వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన సైలెంట్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికే అలియా భట్ షూటింగ్ లో పాల్గొందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఒకవేళ అ...