భారతదేశం, జూలై 21 -- Kajal Aggarwal: నటి కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ప్రొడక్షన్ కల్చర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలలో అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల్లో ఉండే క్రమ శిక్షణ, సమయ పాలన బాలీవుడ్‌లో అస్సలు ఉండవని ఓపెన్‌గా చెప్పేశారు.

'సికిందర్' సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ కోసం తను గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని కాజల్ గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచి సల్మాన్ తన క్రష్ అయినప్పటికీ.. ఆయన సెట్స్‌కి మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో రావడం వల్ల తనకు చాలా టైమ్ వేస్ట్ అయిందన్నారు. సౌత్ మేకర్స్ పాటించే టైమింగ్స్‌కి అలవాటు పడిన తనకు, ఆ వెయిటింగ్ టైమ్‌లో ఏమీ తోచక సెట్‌లోనే ఉన్న జిమ్‌లో కసరత్తులు చేసేదాన్నని నవ్వుతూ చెప్పారు.

హ...