భారతదేశం, నవంబర్ 15 -- KAAKA Special Song: మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'కాకా'. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'కాకా' పై అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఇదొక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అని, ఇందులో చిరంజీవి రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో (డ్యూయల్ షేడెడ్ రోల్) కనిపించనున్నారని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో కాకా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై స్పీడ్ పెంచింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ మ్...