భారతదేశం, జూలై 25 -- Jyotika: దేశవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంలో కోలీవుడ్ నటి జ్యోతిక సంచలన పోస్ట్ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి ఆమె బహిరంగంగా మద్దతు ప్రకటించారు. విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఒక పవర్‌ఫుల్ నోట్ షేర్ చేసిన జ్యోతిక.. "జై హింద్" అంటూ పోరాటం చేస్తున్న విద్యార్థుల వైపు నిలబడ్డారు. మన దేశ భవిష్యత్తు అయిన స్టూడెంట్స్ కోసమే తాను గళం వినిపిస్తున్నానని, విద్యావ్యవస్థలో పారదర్శకత, బాధ్యత ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు.

"ధర్మేంద్ర ప్రధాన్.. వెంటనే మీ ప...