భారతదేశం, మే 15 -- Jyotika: ఒకప్పుడు దక్షిణాది సినిమాను ఏలిన నటి జ్యోతిక.. దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత బాలీవుడ్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను జైత్రయాత్రలా కొనసాగిస్తున్నారు. 2024లో హిందీ తెరకు రీ-ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు రెండేళ్లలో తన మూడవ హిందీ చిత్రం 'సిస్టమ్' (System) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె హిందుస్థాన్ టైమ్స్ తో తన సినిమా విశేషాలను పంచుకున్నారు.

ప్రముఖ దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో వస్తున్న లీగల్ డ్రామా మూవీ సిస్టమ్ లో జ్యోతికతో పాటు సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహిళా దర్శకురాలితో పనిచేయడం గురించి జ్యోతిక మాట్లాడింది.

"మహిళా దర్శకురాలితో పని చేయడం ఎప్పుడూ చాలా సౌకర్యంగా ఉంటుంది. మగ డైరెక్టర్ల కంటే ఆమె మా మాటలను ఎక్కువ శ్రద్ధతో వింటారు. ఒకే జెండర్ కావడంతో మా ఆలోచనా విధానం కూ...