భారతదేశం, మే 2 -- వైశాఖ మాసం పూర్తయిపోయింది. జ్యేష్ఠ మాసం ఈరోజు నుంచి మొదలు కాబోతోంది. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అనేది మూడవ మాసం. ఈ నెలలో బ్రహ్మదేవుని ఆరాధించడం వలన ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. పితృదేవతల రుణాన్ని తీర్చుకోవడానికి కూడా ఈ మాసం సరైనది. అలాగే పాపాలను పరిహరించుకోవడానికి, దైవ సేవలో లీనం అవ్వడానికి కావాల్సిన పుణ్య తిధులు జ్యేష్ఠ మాసంలో ఉంటాయి.

ఈ ఏడాది అధిక మాసం కూడా ఉంది. అంటే ఒక నెల ఎక్కువగా ఉంటుంది. అది కూడా జ్యేష్ఠ మాసమే ఎక్కువగా ఉంటుంది. అంటే 60 రోజుల పాటు జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఉన్న విశేష తిధులతో పాటుగా పాపాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం.

తెలుగు పంచాంగం ప్రకారం మే 2వ తేదీ నుంచి జ్యేష్ఠ మాసం మొదలైంది. ఈ నెలలో కొన్ని తిధులు చాలా ప్రత్యేకమైనవి. ఆ రోజుల్లో దైవారాధన గురించి, ఈ మాసం ...