భారతదేశం, జనవరి 15 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా చాలా మార్పులను తీసుకు వస్తుంది. 2026లో కొన్ని ప్రధాన గ్రహాల సంచారాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. 2026లో గురుగ్రహ సంచారం కారణంగా హంస మహాపురుష రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ హంస మహాపురుష రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు లభించనున్నాయి. ఏ రాశుల వారిపై దీని ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గురు గ్రహం జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. గురు సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఈ హంస మహాపురుష రాజయోగం కొన్ని రాశు...