భారతదేశం, ఏప్రిల్ 23 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ముఖ్యంగా శుభ గ్రహాలకు అధిపతి, సంపద మరియు జ్ఞానాన్ని ప్రసాదించే దేవగురువు బృహస్పతి (గురువు) చేసే నక్షత్ర మార్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ప్రస్తుతం పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్న గురువు, త్వరలోనే తన గమనాన్ని మార్చుకోబోతున్నారు.

హిందూ పంచాంగ గణాంకాల ప్రకారం, 2026 జూన్ 18వ తేదీన గురువు శని దేవుడికి అత్యంత ప్రియమైన 'పుష్యమి' నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో పుష్యమి నక్షత్రాన్ని 'నక్షత్రాల రాజు'గా పిలుస్తారు. ఆగస్టు 18 వరకు అంటే దాదాపు రెండు నెలల పాటు గురువు ఇదే నక్షత్రంలో ఉంటారు. గురువు, శని శక్తుల కలయిక వల్ల ఏర్పడే ఈ మార్పు కొన్ని రాశుల వారికి అదృష్ట రేఖను మార్చబోతోంది. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే..

ధనుస్సు రాశి వారికి ...