భారతదేశం, జూన్ 15 -- Jr NTR Review: టాలీవుడ్ లో ఎప్పుడూ వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రాలను సపోర్ట్ చేయడంలో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటారు. తాజాగా ఆయన థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు సరికొత్త సినిమా 'సింగ్ గీతం' చూసి ఫుల్ ఫిదా అయ్యారు. ఈ సినిమా అందించిన అనుభూతిని పంచుకుంటూ ఎక్స్ వేదికగా తారక్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ సింగ్ గీతం సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. "సింగ్ గీతం నా హృదయాన్ని హత్తుకున్న ఒక బ్యూటిఫుల్ మూవీ. లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో కూడా తనకే సాధ్యమైన క్రియేటివిటీని, విజ్ఞానాన్ని వెండితెరపై చూపించిన తీరు అద్భుతం. దానికి సాక్ష్యంగా నిలవడం నాకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది" అని కొనియాడారు.

సినిమా ఇప్పట...