భారతదేశం, మే 20 -- Jr NTR: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్దే కాదు, సంపాదనలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ తారక్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం పాన్-ఇండియా మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న కథానాయకుడిగా నిలిచాడు.

తాజా నివేదికల ప్రకారం.. ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ (నెట్ వర్త్) సుమారు 500 కోట్ల రూపాయలుగా అంచనా. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్లే ఈ భారీ సామ్రాజ్యానికి ప్రధాన కారణం. దివంగత నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తారక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

సినిమా సినిమాకూ ఎన్టీఆర్ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతున్నాడు...