భారతదేశం, మే 20 -- Jr NTR: గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారం (మే 20) తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అర్ధరాత్రే డ్రాగన్ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో వచ్చిన విషయం తెలిసిందే. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు కూడా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్, బన్నీకి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఆత్మీయంగా ఒకరినొకరు 'బావ' అని పిలుచుకుంటారు. అదే చనువుతో బన్నీ చేసిన స్పెషల్ ట్వీట్ నందమూరి, అల్లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

"బావా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఎప్పుడూ ఆనందం, శాంతి, సిరిసంపదలతో నిండిపోవాల...