భారతదేశం, జూన్ 15 -- Jiohotstar Web Series: 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', '3 ఇడియట్స్', 'పీకే' లాంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్స్ అందించిన టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ మొదటిసారి ఓటీటీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన షోరన్నర్, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ప్రీతమ్ అండ్ పెడ్రో'.

ఈ ల్యాండ్‌మార్క్ వెబ్ సిరీస్ ను 'పాతాల్ లోక్', 'స్కూల్ ఆఫ్ లైస్' ఫేమ్ ఫేమస్ డైరెక్టర్ అవినాష్ అరుణ్ ధావరే తెరకెక్కించారు. తాజాగా (జూన్ 15న) ఈ వెబ్ సిరీస్ అఫీషియల్ ట్రైలర్ ను జియోహాట్‌స్టార్ (JioHotstar) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది.

ఈ ప్రీతమ్ అండ్ పెడ్రో వెబ్ సిరీస్ కథ అంతా గోవా బ్యాక్‌డ్రాప్‌లో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. "డేటా మీట్స్ దండా" అనే కాన్సెప్ట్ తో టెక్నాలజీ, స్ట్రీట్-స్మార్ట్ యాక్షన్ లీడ్ లో ఈ సి...