భారతదేశం, అక్టోబర్ 19 -- భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ 'జియో ప్లాట్‌ఫామ్స్' సిద్ధమైంది. సబ్‌స్క్రిప్షన్ కోసం అక్టోబర్ 21న తెరచుకోనున్న ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీ ఏకంగా రూ. 30,213 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా పేరిట ఉన్న రూ. 27,800 కోట్ల ఐపీఓ రికార్డును ఇది తుడిచిపెట్టనుంది.

ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఐపీఓ జీఎంపీ, ప్రైస్ బ్యాండ్ సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

జియో ఐపీఓలో పాల్గొనాలనుకునే సామాన్య (రిటైల్) ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 1,065 నుంచి రూ. 1,119 గా ఖరారు చేసింది. ప్రతి షేరు ముఖ విలువ రూ. 10 కాగా, రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 1 లాట్ (12 షేర్లు) కోసం బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్ క...