భారతదేశం, అక్టోబర్ 10 -- షాప్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు జేబులోంచి ఫోన్ తీయకుండా, అన్‌లాక్ చేయకుండా, స్క్రీన్ కూడా తాకకుండా కేవలం వాయిస్ కమాండ్‌తో పేమెంట్ పూర్తి చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇది ఏదో ఊహాజనిత సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యం కాదు. త్వరలోనే మన రోజువారీ జీవితంలోకి రాబోతున్న సరికొత్త సాంకేతిక విప్లవం ఇది! దేశీయ టెలికాం దిగ్గజం 'రిలయన్స్ జియో' ఈ విధమైన అద్భుత సాంకేతికతను సాకారం చేసింది.

దిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026' వేదికగా జియో తమ సరికొత్త ప్రొడక్ట్ లైనప్‌ను ప్రదర్శించింది. ఇందులో భాగంగా ఏఐ కెమెరా గ్లాసెస్, ఆడియో గ్లాసెస్, స్మార్ట్ ఇయర్‌ఫోన్లతో కూడిన పర్సనల్ 'ఏఐ వేరబుల్స్' శ్రేణిని ఆవిష్కరించింది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఈ ఏఐ గ్లాసెస్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ 'స్కాన్ అండ్ పే'. మ...