Jewellery Robbery Case : కరీంనగర్ జ్యువెలరీ కేసులో పురోగతి - ముగ్గురు నిందితులు అరెస్ట్..! పరారీలోనే గ్యాంగ్ లీడర్
భారతదేశం, మే 14 -- Karimnagar PMJ Jewellery Robbery Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూం దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మే 3వ తేదీన పట్టపగలే తుపాకులతో హల్చల్ చేసి.. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లిన అంతరాష్ట్ర ముఠాలోని పలువురిని అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని.. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొంతమేర బంగారు ఆభరణాలు, పిస్టల్స్, పరారీకి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు.
షోరూంలో దోపిడీ అనంతరం దొంగలు తమ బైకులపై మహారాష్ట్ర మీదుగా పశ్చిమ బెంగాల్‌కు పారిపోయినట్లు విచారణలో తేలింది. సుమారు 1.6 కేజీల బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకున్న ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజీని ఆధారంగా చేసుకుని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.