భారతదేశం, ఏప్రిల్ 23 -- JD Chakravarthy: తెలుగు చిత్ర పరిశ్రమలో జేడీ చక్రవర్తి అంటేనే ఒక విభిన్నమైన ముద్ర. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన ఈ నటుడు.. 'శివ' కాలం నుండి నేటి వరకు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన తన ముద్ర వేశారు.

తాజాగా ఆయన 'గాయపడ్డ సింహం' అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జేడీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు లోకనాయకుడు కమల్ హాసన్. పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే కమల్ హాసన్ గురించి జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"నటనలో కమల్ హాసన్ గారు నాకు ఇన్‌స్పిర...