భారతదేశం, మార్చి 11 -- ఓ వైపు దళపతి విజయ్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో మరో తమిళ హీరో రవి మోహన్ (జయం రవి) వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పురుషులే అతి పెద్ద బాధితులంటూ అతను పెట్టిన పోస్టుకు రవి మాజీ భార్య ఆర్తి సిస్టర్ తనుజ సింగం కౌంటర్ వైరల్ గా మారింది.

తన భార్య ఆర్తి రవి నుంచి విడిపోతున్నట్లు తమిళ హీరో రవి మోహన్ 2024 సెప్టెంబర్ లో ప్రకటించాడు. ఆ తర్వాత అతను సింగర్ కనిషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం 'యాన్ ఆర్డినరీ మ్యాన్' సినిమా పూజ కార్యక్రమాల ఫొటోలను రవి మోహన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో యోగి బాబు హీరో. ఈ మూవీకి రవి మోహన్ డైరెక్టర్. ఈ పూజ కార్యక్రమంలో కనిషా కూడా పాల్గొంది.

రవి మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఫస్ట్ మూవీ 'యాన్ ఆర్డినరీ మ్యాన్'. ఈ సినిమా పూజ కార్యక...